ఏపీలో కాకరేపుతున్న ఓట్ల తొలగింపు కేసులు..!

ఏపీలో కాకరేపుతున్న ఓట్ల తొలగింపు కేసులు..!
x
Highlights

ఏపీలో వివాదం సృష్టిస్తోన్న ఆన్‌లైన్‌ దరఖాస్తు ఇది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు రాజకీయ దుమారం రేపుతోంది. ఫారం-7 ద్వారా ఓట్లు...

ఏపీలో వివాదం సృష్టిస్తోన్న ఆన్‌లైన్‌ దరఖాస్తు ఇది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు రాజకీయ దుమారం రేపుతోంది. ఫారం-7 ద్వారా ఓట్లు తొలగిస్తున్నది మీరంటే మీరని అధికార, విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకొంటున్నాయి. వివాదం ముదరడంతో ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది. ఫారం-7 ద్వారా ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టం చేసింది.

ఏపీలో ఓట్ల తొలగింపు అంశం సృష్టించిన వివాదం అంతా ఇంతాకాదు. ఓట్ల తొలగింపు అంశంపై అధికార, విపక్షాలు ప్రత్యారోణలు చేసుకోవడంతో ఏది నిజమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ నేతలు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఏపీలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే భారీగా వైసీపీ అనుకూరుల ఓట్లను తొలగిస్తున్నరని అంటోంది. అయితే ఓట్ల తొలగింపు సూత్రధారి వైసీపీయేనని టీడీపీ ప్రత్యారోపణ చేస్తోంది. ఓట్ల తొలగింపులో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ దిట్ట అని అంటోంది. తెలంగాణ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లు తొలగించి టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిందని ఏపిలోనూ అదే తరహా కుట్రలను కేసీఆర్ ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతోంది.

తాజాగా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌‌ ఓటు రద్దు కోరుతూ ఫాం 7 దాఖలైంది. ఆ దరఖాస్తును వైసీపీ నేతే దాఖలు చేసినట్లు గుర్తించారు. కానీ చివరి నిమిషంలో ఆన్‌లైన్‌ ధరఖాస్తును గుర్తించిన ఎమ్మార్వో విచారణ అనంతరం ఆ అప్లికేషన్‌ను తిరస్కరించారు. తనకు తెలియకుండానే తన ఓటు రద్దు చేయాలంటూ దాఖలైన ఫాం 7పై ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ధర్మవరం నియోజకవర్గంలో 11 వేల ఓట్లు తొలగించారని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సత్యనారాయణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 10 కంప్యూటర్లతో ఫారం 7 దరఖాస్తులు చేశారని ఫిర్యాదు చేశారు.

ఓట్ల తొలగింపు ఆరోపణలపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం‌ స్పందించింది. ఓట్ల తొలగిపు కోరుతూ మొత్తం 8 లక్షల దరఖాస్తులు రాగా 2 లక్షల అప్లికేషన్‌లను పరిశీలించామని ఈసీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఫారం-7 దరఖాస్తుల ద్వారా ఒక్క ఓటు తొలగించలేదని స్పష్టం చేశారు. ఓట్ల తొగింపు అంశంపై 232 కేసులు నమోదు కాగా ఐదుగుర్ని అరెస్టు చేసినట్లు వివరించారు. అయితే కేసుల నమోదు తర్వాత ఫారం 7 దరఖాస్తులు తగ్గాయని చెప్పారు. ఓటర్ల ప్రమేయం లేకుండా ఫారం 7 దరఖాస్తులు వచ్చినా మూడు దశల్లో పరిశీలించిన తర్వాతే ఓట్లు తొలగిస్తామని ద్వివేది తేల్చి చెప్పారు. ఈసీ వివరణ తర్వాత అయినా ఓట్ తొలగింపు వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories