రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..

రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..
x
Highlights

మార్చి 10న షెడ్యూల్‌ రిలీజైంది. 18న నోటిఫికేషన్ వచ్చింది. చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. దాదాపునెలరోజులపాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి...

మార్చి 10న షెడ్యూల్‌ రిలీజైంది. 18న నోటిఫికేషన్ వచ్చింది. చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. దాదాపునెలరోజులపాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లో ముగియనుంది. రేపు సాయంత్రం 5గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. జనంతో కిటకిటలాడిన ప్రధాన కూడళ్లన్నీ బోసిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్‌ క్యాంపైనింగ్‌ క్లైమాక్స్‌ చేరుకుంది. నెల రోజులుగా హోరాహోరీ సాగుతోన్న ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. రేపు సాయంత్రం 5గంటల తర్వాత మైకులు బంద్‌ కానున్నాయి. దాంతో ప్రధాన పార్టీలన్నీ లాస్ట్‌ డే క్యాంపైనింగ్‌పై ఫోకస్ పెట్టాయి. ఇక చివరి రోజు మెరుపులు మెరిపిస్తూ, ప్రచారానికి ఫైనల్ టచ్ ఇచ్చేందుకు పార్టీల అధినేతలు సిద్ధమవుతున్నారు.

ఇన్ని రోజుల ప్రచారం ఒకత్తయితే లాస్ట్‌ డే క్యాంపెయిన్ మరో ఎత్తు. అందుకే చివరి రోజు ప్రచారంపై పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. తక్కువ టైమ్‌లో ఎక్కువ ఏరియాలు కవర్ అయ్యేలా సభలు, రోడ్‌షోలపై దృష్టిపెట్టారు. అలాగే పోలింగ్‌కు ముందు రెండ్రోజులే అత్యంత కీలకం కావడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అలుపెరగకుండా సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు చివరి రోజు గురజాల, సత్తెనపల్లె, తాడికొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మంగళగిరి, పొన్నూరు, తిరుపతి, కర్నూలు నియోజకవర్గాల్లో క్యాంపైనింగ్‌ చేయనున్నారు. అటు షర్మిల, విజయమ్మ కూడా రోడ్‌షోలతో ప్రచారానికి ఫైనల్ టచ్ ఇవ్వనున్నారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్‌ తాను పోటీ చేస్తున్న గాజువాక, భీమవరంలో చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories