ముగిసిన చివరి విడత ఎన్నికల ప్రచారం...బీజేపీకి కీలకంగా మారిన...

ముగిసిన చివరి విడత ఎన్నికల ప్రచారం...బీజేపీకి కీలకంగా మారిన...
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో చివరి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 8 రాష్ట్రాల్లో విస్తరించిన 59 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచారం సమాప్తమైంది....

సార్వత్రిక ఎన్నికల్లో చివరి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 8 రాష్ట్రాల్లో విస్తరించిన 59 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచారం సమాప్తమైంది. బెంగాల్‌లో చివరి విడత ఎన్నికలు జరగనున్న 9 నియోజకవర్గాల్లో నిన్న రాత్రే ప్రచారం ముగిసింది. మొత్తం 8 రాష్ట్రాల్లో విస్తరించిన 59 నియోజకవర్గాల్లో ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో - 13, పంజాబ్‌ - 13, పశ్చిమ బెంగాల్‌ - 9, బీహార్‌ - 8, మధ్యప్రదేశ్‌ - 8, హిమాచల్‌ప్రదేశ్‌ - 4, జార్ఖండ్‌ - 3, చంఢీగఢ్‌ - 1 స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల బరిలో వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, కాంగ్రెస్‌ నాయకుడు శతృఘ్న సిన్హా, సన్నీడియోల్‌ తదితరులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.

తదివిడత ప్రచారానికి చివరి రోజు కావడంతో రాజకీయ నాయకులంతా క్యాంపెయినింగ్‌లో జోరు పెంచారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ప్రధాని మోడీ మధ్యప్రదేశ్‌లో పర్యటించగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్‌లోని మిర్జాపూర్‌, ఖుషీ నగర్‌లలో రోడ్ షో నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories