బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో షా ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో షా ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటుకు సంకేతాలు వస్తున్నాయంటే బీజేపీ యేతర పక్షాలు ప్రధాని మోడీ శక్తిసార్థ్యాలను గుర్తించినట్లే అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు.

కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటుకు సంకేతాలు వస్తున్నాయంటే బీజేపీ యేతర పక్షాలు ప్రధాని మోడీ శక్తిసార్థ్యాలను గుర్తించినట్లే అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోని రాం లీలా మైదాన్‌లో రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రారంభోపన్యాసం చేసిన అమిత్ షా నాయకుడు లేని రాజకీయ పక్షాలతో ప్రధాని మోడీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోరాడబోతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలు రెండు విరుద్ధ భావజాలాల మధ్య పోరాటమని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక బ్యాంకు ఖాతాలు, గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు వంటివి నాలుగున్నరేళ్ళలోనే అందరికీ ఇచ్చిందని, 2022 నాటికి ప్రతి పౌరునికి శాశ్వత ఇళ్లు ఉండేలా చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories