సార్వత్రిక ఎన్నికల ముందు మాయావతికి ఎదురుదెబ్బ

సార్వత్రిక ఎన్నికల ముందు మాయావతికి ఎదురుదెబ్బ
x
Highlights

సార్వత్రిక ఎన్నికల ముందు మాయావతికి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్పీ అధినేత్రి మాయావతికి సంబంధించిన ఆస్తులపై ఈడీ దాడులు చేసింది. స్మారక కట్టడాల అక్రమాల...

సార్వత్రిక ఎన్నికల ముందు మాయావతికి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్పీ అధినేత్రి మాయావతికి సంబంధించిన ఆస్తులపై ఈడీ దాడులు చేసింది. స్మారక కట్టడాల అక్రమాల కేసులో లక్నోలోని 7 ప్రాంతాల్లో ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాయవతి హయాంలో 14వందల కోట్ల అక్రమాలు జరిగినట్టు గతంలో లోకాయుక్త గుర్తించింది. స్మారక స్కామ్‌లో దోషులు ఎవరూ తప్పించుకోవడానికి వీలులేదని 2018 సెప్టెంబర్‌లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. 2007 - 2011 మధ్య కాలంలో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories