ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే...!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే...!
x
Highlights

సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగనుంది. మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది.

సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగనుంది. మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు అలాగే ఎన్ని విడతల్లో పోలింగ్ నిర్వహించాలనే విషయమై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3తో ముగియనుంది. భద్రతా దళాల లభ్యత, వాతావరణ పరిస్థితుల సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల తేదీలు ఖరారు చేసేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయమై మాత్రం ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌తో పాటే అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఈసీ ఏర్పాటు చేస్తోందని సమాచారం. జూన్ 18తో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. 2014లో మార్చి 5న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ ఏప్రిల్ మే నెలల్లో 9 విడతలుగా పోలింగ్ నిర్వహించింది. ఏప్రిల్ 7న తొలి విడత పోలింగ్ చేపట్టిన ఈసీ మే 12 వ తేదన తుది విడత పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియను ముగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories