నెగ్గిన చంద్రబాబు పంతం... ఏపీ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

నెగ్గిన చంద్రబాబు పంతం... ఏపీ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌
x
Highlights

ఏపీ కేబినేట్‌ సమావేశానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నేడు మంత్రివర్గ సమావేశం నిర్వహణకు అనుమతిచ్చింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు కేబినేట్‌ సమావేశం...

ఏపీ కేబినేట్‌ సమావేశానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నేడు మంత్రివర్గ సమావేశం నిర్వహణకు అనుమతిచ్చింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు కేబినేట్‌ సమావేశం జరగనుంది. అయితే, విధానపరమైన నిర్ణయాల జోలికి వెళ్లకుండా. అవసరమైన సూచనలకు మాత్రమే కేబినెట్ భేటీ పరిమితంకానుంది.గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరతీస్తూ ఏపీ కేబినేట్‌ సమావేశానికి ఈసీ అనుమతినిచ్చింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినేట్‌ సమావేశంకానుంది. తుఫాన్ ప్రభావం, కరువు, తాగునీటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అయితే, కేబినెట్ భేటీపై ఈసీ కొన్ని నిబంధనలను సూచించింది. విధానపరమైన నిర్ణయాల జోలికి వెళ్లకుండా అవసరమైన సూచనలకు మాత్రమే కేబినెట్ భేటీ పరిమితంకావాలని తెలిపింది.

అంతకు ముందు, ఏపీ కేబినెట్ విషయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం చంద్రబాబుతో భేటీ కావడంపై ఆసక్తి కొనసాగుతోంది. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఎల్వీ ఒక్కసారి మాత్రమే చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ ఒక్కసారి మినహా, సీఎం సచివాలయంకి వచ్చి రివ్యూలు నిర్వహించినా సీఎస్ అటువైపు వెళ్ళలేదు. అయితే, ఇప్పుడు మంత్రివర్గ భేటీ వ్యవహరంలో ఇరువురు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా భాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సీఎంకు, ఆయనకి మధ్య సఖ్యతలేదనే ఆరోపణలు వినిపించాయి. సీఎం రివ్యూలో పాల్గొన్న అధికారులను.. కోడ్ ఆఫ్ ఆక్ట్ కింద వివరణ కోరారు. మే 10న కేబినెట్ నిర్వహించాలని.. సీఎంవో నుంచి సీఎస్‌ కి లేఖ పంపారు. కొన్ని కారణాల దృష్ట్యా మంత్రివర్గ సమావేశం 14వ తేదీకి వాయిదా పడింది. అయితే, ఎన్నికల కోడ్ ఉన్న నేపద్యంలో అత్యవసరం అయితే మినహా, కేబినెట్ నిర్వహించకూడదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేవలం నాలుగు అంశాలపై మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని మళ్ళీ సీఎంవో నుంచి సీఎస్‌కు లేఖను పంపారు.

దీనితో ఈ నెల 9న నాలుగు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులు ఇచ్చిన నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఈ నెల 27 వరకు ఉండటంతో కేబినెట్ భేటీకి అనుమతించాలంటూ సీఎస్ లేఖను రాశారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన సీఎం, సీఎస్ భేటిలో మంత్రివర్గ సమావేశంపైనే చర్చ జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories