logo

ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు

ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు
Highlights

ప్రముఖ సీనియర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు చేశారు. ఈనెల(మార్చి) 12న బెంగళూరులోని మహత్మ గాంధీ...

ప్రముఖ సీనియర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు చేశారు. ఈనెల(మార్చి) 12న బెంగళూరులోని మహత్మ గాంధీ సర్కిల్ వద్ద ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ మీడియా మరిము భావ ప్రకటన స్వేచ్చ అనే అంశంపై ప్రకాశ్ రాజ్ ప్రస్తావించారు. అయితే ఎన్నికల కోడ్ సమయంలో ప్రకాశ్ రాజ్ ఓట్లు అభ్యర్థించారని ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా భావించి పోలీసులు తెలిపారు. దినికి సంబంధించన ఓ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగా వైర్ కావడంతో ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. కాగా ఈ కేసు నమోదు విషయంపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. అసలు తాను ఆ సమావేశంలో కేవలం మీడియా మరిము భావ ప్రకటన స్వేచ్చ అనే అంశంపై మాత్రమే ప్రస్తావించనని చెప్పుకొచ్చారు. అసలు ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే రాదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. కాగా శుక్రవారం బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు.

లైవ్ టీవి

Share it
Top