ముగిసిన సార్వత్రిక ఎన్నికల కోడ్

ముగిసిన సార్వత్రిక ఎన్నికల కోడ్
x
Highlights

సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ఈసీ ఓ...

సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ఈసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 10న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈనెల 23తేదిన ఎన్నికలసంఘం ఫలితాలను కూడా వెల్లడించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసినందున తక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని ఎత్తివేసినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన కార్యదర్శులకు, చీఫ్‌ ఎలక్ట్రోల్‌ ఆఫీసర్లకు ఎన్నికల కోడ్ ఉత్తర్వుల రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం సమాచారం అందించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories