వైసీపీలోకి సీఎల్‌ వెంకట్రావు

వైసీపీలోకి సీఎల్‌ వెంకట్రావు
x
Highlights

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు...

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టారు. ఇక అప్పుడే ఏపీ కేబినేట్‌ మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. జూన్‌ 8 న ఉదయం 9 గంటలా 15 నిమిషాల నుంచి 11 గంటలా 30 నిమిషాల మధ్య మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఇలా జోరుమీద వైసీపీలో వలసలు బాట పడుతున్నారు ఆయా పార్టీ నేతలు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత ఏపీ స్వచ్ఛాంధ్రమిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ సీఎల్‌ వెంకట్రావు వైసీపీ గూటికి చేరనున్నారు. వైసీపీలో చేరడానికి సహ చరులు కొంతమంది రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా కైకలూరు నియోజక వర్గంలో టీడీపీకి కొన్నేళ్లుగా అండగా ఉంటూ పార్టీకి విశేష సేవలందించిన డాక్టర్‌ సీఎల్‌ వైసీపీ గూటికి చేరాలన్న నిర్ణయం పార్టీ కేడర్‌లో విస్మయం కలిగిస్తోంది. ఇక మంత్రి వర్గం ఏర్పాటయ్యాక సీఎల్‌ వైసీసీ కండువా కప్పుకొనున్నట్లు వెల్లడించారు.

అయితే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కనుమరుగయ్యాయని వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయని సీఎల్‌ విమర్శించారు. త్వరలో ఏపీలో టీడీపీ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలున్నా యన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. మంత్రి వర్గం ఏర్పడ్డాక సీఎం జగన్ మోహన్ రెడ్డికి కలుస్తానన్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories