తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..
x
Highlights

మియపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మియపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది....

మియపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మియపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు స్టే విధించింది. మియపూర్ భూములను యధావిధిగా ఉంచాలని స్టేటస్‌కో ఆర్డర్ ఇచ్చింది. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి పట్ల సానుభూతి ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు పరిష్కారం అయ్యేంత వరకూ మియపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ, ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం కానీ చేయకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా మియాపూర్, బాలానగర్‌ ప్రాంతాల్లో దాదాపు వేల కోట్ల విలువైన భూములకు అక్రమ రిజిస్టేషన్లతో అక్రమార్కులకు అమ్ముతున్నారంటూ భారీ స్కాం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే కాగా దీనిపై స్పందించిన ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పుతో ఇప్పుడు మియాపూర్ భూముల విషయంలో యధాతథ స్థితి కొనసాగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories