తల్లికి తెలియకుండా శిశువును అమ్మేసిన డాక్టర్

తల్లికి తెలియకుండా శిశువును అమ్మేసిన డాక్టర్
x
Highlights

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన మగబిడ్డను తల్లికి తెలియకుండా ప్రసవం నిర్వహించిన లేడీ డాక్టర్ అమ్మేసింది. చిన్నం కనకదుర్గ...

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన మగబిడ్డను తల్లికి తెలియకుండా ప్రసవం నిర్వహించిన లేడీ డాక్టర్ అమ్మేసింది. చిన్నం కనకదుర్గ అనే దివ్యాంగురాలు బందర్‌లోని వాణీ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. పొత్తిళ్లలో సేదతీరాల్సిన బిడ్డ కనిపించకపోవడంతో తల్లి డాక్టర్లను నిలదీసింది. కడుపులో ఎలాంటి శిశువు లేదని గడ్డని మాత్రమే బయటకు తీశామంటూ ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ వాణీ కుసుమ చెప్పంది. డాక్టర్ పై అనుమానం వచ్చిన బాధితురాలు బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

లేడీ డాక్టర్ తో పాటు నర్సును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఏడు నెలల 15 రోజుల మగబిడ్డను లక్ష్మినారాయణ అనే వ్యక్తికి అమ్మేసినట్లు ఒప్పుకున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. చిన్నారిని స్వాధీనం చేసుకుని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బేబి పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో ఇంక్యుబెటర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

హస్పిటల్ డాక్టర్ వాణికుసుమ, ల్యాబ్ అసిస్టెంట్ కిరణ్ తో పాటు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిని గతంలో కలిశామని హస్పిటల్ ల్యాబ్ లో పని చేస్తున్న కిరణ్ శిశువును ఇచ్చారే తప్ప తాము కొనుగోలు చేయలేదంటున్నారు శిశువును తీసుకెళ్లిన వారు.


Show Full Article
Print Article
Next Story
More Stories