logo

టీఆర్ఎస్‌పై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు..

టీఆర్ఎస్‌పై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు..
Highlights

ఇటివలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరిన డీకే అరుణ టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యాలు చేశారు....

ఇటివలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరిన డీకే అరుణ టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోనే సత్తా కేవలం ఒక్క బీజేపికే మాత్రమే ఉందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బిజేపి పార్టీయే ప్రత్యామ్నాయమని డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ కుటుంబ పాలన సాగుతున్నదని విమర్శించారు. ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.


లైవ్ టీవి


Share it
Top