వైసీపీ విజయంలో అమెది కూడా కీలక పాత్రే..

వైసీపీ విజయంలో అమెది కూడా కీలక పాత్రే..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది . ఇది మామలు విజయం కూడా కాదు .. అఖండ విజయం ..టిడిపి తన రాజకీయ ప్రస్థానంలో ఇంతా ఘోరమైన ఓటమి మరొకటి లేదు...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది . ఇది మామలు విజయం కూడా కాదు .. అఖండ విజయం ..టిడిపి తన రాజకీయ ప్రస్థానంలో ఇంతా ఘోరమైన ఓటమి మరొకటి లేదు .. అయితే వైసీపీ విజయంలో జగన్ ది ఎంతటి ముఖ్య పాత్రో సోషల్ మీడియాది కూడా అంతే పాత్ర .. అనుకూల టీడీపీ మీడియాతో అభూతకల్పనలు ప్రచారం చేస్తూ వైసీపీని దెబ్బకొట్టాలన్న వ్యూహాన్ని అంతే ధీటుగా ఎదుర్కొంది వైసీపీ సోషల్ మీడియా టీం. కుట్రలను చిత్తు చేసి ప్రజలకు వాస్తవాలు వివరించి జగన్ కు తోడుగా నిలిచిన వైసీపీ సోషల్ మీడియా నడిపించింది ఒక మహిళ.. వైసీపీ గెలుపులో ఆమె పాత్ర మరువలేనది.దివ్యారెడ్డి.. వైఎస్ఆర్ సీపీ అఫీషియల్ డిజిటల్ మీడియా హెడ్ (డీఎంవో) .

ఇదంతా ఒకే సమయంలో గురి తప్పకుండా ఏకకాలంలో జరగడానికి కారణం దివ్యారెడ్డి. ఎంతో ఓర్పుతో.. క్రియేటివ్ ఐడియాస్ తో టీమ్ మేనేజ్ మెంట్ తో సక్సెస్ ఫుల్ గా చివరి నిమిషం వరకు వైసీపీ కోసం ఫైట్ చేశారు. అది బాగా హెల్ప్ అయ్యింది. ఏది కరెక్ట్.. ఏది పార్టీ స్టాండ్.. ఎక్కడ నెగెటివ్ అవుతుంది.. ఎక్కడ ప్లస్ అవుతుంది అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా సోషల్ మీడియా కంటెంట్ ప్లాన్ చేశారు.

దివ్యారెడ్డి తో పాటు డీఎంవోలో ఉండే అందరూ రాత్రీపగలు శ్రమించారు. సెలవులు పండుగలు లేకుండా శ్రమించారు. ఎల్లో మీడియా ట్రిక్స్ అన్నింటిని అడ్డుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఎల్లో మీడియా వర్సెస్ సోషల్ మీడియా లాగా తయారు చేశారు. న్యూట్రల్ గా ఉన్న ఓటర్లు కూడా వైసీపీ సోషల్ మీడియా ప్రచారానికి టర్న్ అయ్యారు. టీడీపీకి వ్యతిరేకంగా.. వైసీపీకి అనుకూలంగా మారారు.

Show Full Article
Print Article
Next Story
More Stories