Top
logo

వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. జగన్ సమక్షంలోనే...

వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. జగన్ సమక్షంలోనే...
X
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పాడేరులో పాల్గొన్న...

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పాడేరులో పాల్గొన్న జగన్‌కి చేదు అనుభవం ఎదురైంది. పాడేరు వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జగన్ ముందే వైసీపీ పార్టీ ఫ్లెక్సీలు చింపేసి హంగామా సృష్టించారు. వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా ఆ పార్టీ పాడేరు సమన్వయకర్త మత్యరాస విశ్వేశ్వరరాజు అభిమానులు నినాదాలు చేయడమే కాకుండా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు.ఇక దీంతో రంగంలోకి దిగిన ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో వారిని కొట్టారు. ఈ క్రమంలోనే మత్యరాస బాలరాజు వైసీపీకి రాజీనామా చేశారు. మరో వైసీపీ నేత జి.మాడుగుల ఎంపీపీ మత్యకొండం నాయుడు కూడా భాగ్యలక్ష్మిని ఓడిస్తామని హెచ్చరించారు.

Next Story