తేడాలెందుకు వచ్చాయి...ఏపీలో పోలైన ఓట్లకు... ఫలితాల్లో ప్రకటించిన వాటికి...

తేడాలెందుకు వచ్చాయి...ఏపీలో పోలైన ఓట్లకు... ఫలితాల్లో ప్రకటించిన వాటికి...
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఓట్లు లెక్కించారు ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీలో పోలైన ఓట్ల సంఖ్య ఫలితాలు ప్రకటించిన తర్వాత ఓట్ల సంఖ్యలో వ్యత్యాసం...

సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఓట్లు లెక్కించారు ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీలో పోలైన ఓట్ల సంఖ్య ఫలితాలు ప్రకటించిన తర్వాత ఓట్ల సంఖ్యలో వ్యత్యాసం కనిపిస్తోంది. కొన్ని చోట్ల పోలైన ఓట్ల కంటే ఫలితాలు ప్రకటించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే మరికొన్ని చోట్ల తక్కువగా ఉంది తేడాలు ఎందుకు వచ్చాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓట్ల సంఖ్యపై ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.

ఏపీలోని పలు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల సంఖ్యకు ఫలితాలు ప్రకటించిన ఓట్లకు మధ్య చాలా తేడా కనిపిస్తోంది. కొన్ని చోట్ల వందల్లో ఉండగా మరికొన్ని చోట్ల వేల సంఖ్యలో తేడా ఉంది. అధికారిక లెక్కల్లోనే ఈ వ్యత్యాసాలు ఉన్నాయి.

ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని ఈవీఎంలు మొరాయించగా బ్యాటరీ పని చేయక కొన్ని తెరిచేందుకు వీలు లేకుండా పోయంది మాక్ పోల్ తర్వాత కంట్రోల్ యూనిట్లలోనూ ఓట్లను జీరో చేయకుండానే పోలింగ్ ప్రారంభించారు. ఇలాంటి కేంద్రాల్లో ఈవీఎంలను లెక్కించకుండా పక్కన పెట్టారు. గెలిచిన అభ్యర్ధులకు, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్ధికి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తేడా ఉండటంతో చివర్లో కూడా వాటిని లెక్కించలేదు. పోలైన ఓట్ల వివరాలు ఫలితాల సమయంలో కలుపలేదు. ఓట్ల సంఖ్య తేడాపై సందేహ పడాల్సిన అవసరం లేదంటున్నారు రిటర్నింగ్, ఎన్నికల అధికారులు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందలకు పైగా కేంద్రాల్లో రాత్రి తొమ్మిది గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. ఇలాంటి చోట్ల పోలైన ఓట్లకు సంబంధించి మొదట ప్రాధమిక గణాంకాలు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించలేదు. ఒంగోలు, గురజాల, డోన్, చిలకలూరి పేట, పొన్నూరు, తాడిపత్రి , గుంటూరు తూర్పు, తణుకు నియోకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్లు ఫలితాల్లో వెల్లడించిన ఓట్ల సంఖ్యకు మధ్య తేడా ఉన్నట్లుగా అధికారిక లెక్కలు చూపిస్తున్నాయి.

ఎన్నికల్లో పరాజయం పాలైన అభ్యర్ధులు. పార్టీలు ఓటమిపై విశ్లేషించుకుంటుండగా ఎందుకు వ్యత్యాసాలు వచ్చాయన్నదానిపై రిటిర్నింగ్ అధికారుల నుంచి వివరణ కోరుతామంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories