పక్షుల ఊపిరి తీస్తున్న చైనా మాంజా... బ్యాన్‌ చేసినా ఆగని అమ్మకాలు

birds
x
birds
Highlights

సంక్రాంతి పండగ వస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో పతంగుల సందడి మొదలైంది. పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.

ప్రకృతికి హాని పక్షుల పాలిట ఉరితాడు మనుషులకు ప్రమాదం అయినా అందరికీ అదే కావాలి కొందరి సరదా తోటి మనుషులకే కాదు జంతువులు, పక్షుల ప్రాణాల మీదకు తెస్తోంది ఇన్ని అనర్ధాలకు కారణమైన చైనా మాంజాపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

సంక్రాంతి పండగ వస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో పతంగుల సందడి మొదలైంది. పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. పతంగులు ఎగరేయడం అంటే కైట్ ని హైట్ ఎగరేయడం కాదు పక్కోడి కైట్ ను కట్ చేయడంలోనే మజా ఉందని చాలామంది భావిస్తారు. దీనికోసం చాలామంది చైనా మాంజాను వాడుతుంటారు ఈ దారంతో ఇతర పతంగులను కట్ చేయడం ఈజీ కావడంతో ప్రతీ ఒక్కరూ నైలాన్ దారాన్ని పక్కన పెట్టి చైనా మాంజాను వినియోగిస్తున్నారు.

నైలాన్ దారానికి గాజు పొడి అద్ది చైనా మాంజాను తయారు చేస్తారు. దీంతో అది పతంగుల దారాన్ని తెంపేందుకు సులువవుతుంది. అందుకే దీని వినియోగంపై ప్రజల్లో మోజు పెరిగింది. అయితే చైనా మాంజా పర్యావరణానికి హానికరం ఈ మాంజాతో పక్షులు, జంతువులు గాయపడటమో లేదా చనిపోవడం జరుగుతోంది. పిల్లల చేతులు, కాళ్ళకు కూడా గాయాలవుతున్నాయి. రోడ్డున వెళ్ళే వాళ్ళూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

మరోవైపు స్థానికంగా తయారుచేసే సాంప్రదాయ మాంజా వినియోగిస్తే మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదు. హైదరాబాద్ పాత నగరంలో చాలా ఏళ్లుగా పతంగులు, మాంజా తయారీ కొనసాగుతోంది. వీటిపై జీవనోపాది పొందే కుటుంబాలు చాలానే ఉన్నాయి. సంక్రాంతికి నాలుగు నెలల ముందే మాంజా తయారీ మొదలు పెడతారు బియ్యం, మైదా పిండితో పాటు కొన్ని రకాల రంగులు, బెండకాయ నీళ్లు వాడి మాంజాను తయారు చేస్తారు ఇది దృఢంగా ఉండటమే కాకుండా ఎలాంటి హాని చెయ్యదు. అయితే చైనా మాంజా తాకిడికి వీరి వ్యాపారాలు డీలా పడిపోయాయి. మునపటిలా తమ వద్ద మాంజా కొనుగోలు చేసేవారు లేరని వ్యాపారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చైనా మాంజా వాడకం వల్ల కలిగే నష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం. చైనా మాంజాపై బ్యాన్ విధించింది. ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చైనా మాంజా అమ్మిన వారికి లక్షరూపాయల జరిమానాతో పాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో చైనా మాంజాతో కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాటన్ దారంతో పతంగులు ఎగరేసుకోవాలని అటవీ శాఖాధికారులు సూచిస్తున్నారు. పక్షులు, జంతువులు, మనుషులకు హాని కలిగించడంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories