తమ తప్పును దిద్దుకోవడానికి అసలు ఓట్లను డిలీట్ చేశారు.

తమ తప్పును దిద్దుకోవడానికి అసలు ఓట్లను డిలీట్ చేశారు.
x
Highlights

అసలే ఈవీఎం ల పై దుమారం రేగుతోంది. ఇటువంటి పరిస్థితిలో మాక్ పోలింగ్ ఓట్లను తుడిచేయడం మర్చిపోయిన అక్కడి అధికారులు తరువాత తప్పు తెలుసుకున్నారు. ఆ తప్పును...

అసలే ఈవీఎం ల పై దుమారం రేగుతోంది. ఇటువంటి పరిస్థితిలో మాక్ పోలింగ్ ఓట్లను తుడిచేయడం మర్చిపోయిన అక్కడి అధికారులు తరువాత తప్పు తెలుసుకున్నారు. ఆ తప్పును సరిచేయడానికి అసలు ఓట్లను తొలగించేశారు. ఈ సంఘటన తుది విడత పోలింగ్ జరిగిన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే..

అసలు ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు ఈవీఎం లు సరిగా పనిచేస్తున్నాయో లేదో 50 నమూనా ఓట్లు వేసి పరిశీలిస్తారు. తరువాత వాటిని డిలీట్ చేస్తారు. ఈ ప్రక్రియ ఆయా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ లోని పోలింగ్‌కు ముందు నిర్వహించిన మాక్ పోలింగ్ ఓట్లను తొలగించడం మర్చిపోయి.. ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకునేందుకు అసలైన ఓట్లను డిలీట్ చేశారు హిమాచల్ ‌ప్రదేశ్ ఎన్నికల అధికారులు. మొత్తం 5 పోలింగ్ కేంద్రాల్లో ఇలాగే జరిగింది. విషయం బయటకు రావడంతో ఎన్నికల సంఘం క్షమశిక్ష చర్యలకు ఉపక్రమించింది. మొత్తం 20 మంది అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై ఎన్నికల సంఘం దర్యాప్తు ప్రారంభించిందని, ఐదుగురు ప్రిసైడింగ్ అధికారులు, 15 మంది పోలింగ్ అధికారులపై వేటుకు ఈసీ సిద్ధమైందని హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల అధికారి దేవేశ్ కుమార్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories