పాత డెబిట్, క్రెడిట్ కార్డులపై లావాదేవీలు నిలిపివేత...అయోమయంలో వినియోగదారులు

ATMs
x
ATMs
Highlights

ఇక నుంచి పాత ఏటీఎం క్రెడిట్, డెబిట్ కార్డులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో EMV కార్డులు కస్టమర్లకు అందచేశాయి బ్యాంకులు. జనవరి ఒకటో తేది నుంచి పాత కార్టులపై లావాదేవీలు నిలిచిపోయాయి.

ఇక నుంచి పాత ఏటీఎం క్రెడిట్, డెబిట్ కార్డులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో EMV కార్డులు కస్టమర్లకు అందచేశాయి బ్యాంకులు. జనవరి ఒకటో తేది నుంచి పాత కార్టులపై లావాదేవీలు నిలిచిపోయాయి. చాలా మంది ఖాతాదారులకు తెలియక పాత కార్డుతోనే చెల్లింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అవి పని చేయకపోవడంతో బ్యాంకు కార్యాలయాలకు దారిపడుతున్నారు.

బ్యాంకులో ఖాతా జేబులో ఏటీఎం కార్డు ఉందిగా అనుకుంటే పొరబాటే బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్జులకు సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి లేనట్లయితే చిక్కులో పడాల్సి వస్తుంది. పాత క్రెడిట్, డెబిట్ కార్డు స్థానాల్లో అన్ని బ్యాంకులు మ్యాగ్‌స్ట్రైప్ కార్డుల స్థానంలో కొత్తగా EMV కార్డుల్ని కస్టమర్లకు ఇచ్చాయి.

జనవరి ఒకటో తేదీ నుంచి పాత డెబిట్, క్రెడిట్ కార్డులపై లావాదేవీలు నిలిచిపోయాయి. కొత్త కార్డులతో మాత్రమే చెల్లింపులు మొదలయ్యాయి ఇప్పటి వరకు కేవలం 50 శాతం మంది మాత్రమే కొత్త కార్డులు పొందారు. విషయం తెలియక ఎంతో మంది వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. పాత కార్డుల ద్వారానే నగదు లావాదేవీలకు ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారు. మరో మూడు నెలల పాటు ప్రస్తుతం ఉన్న కార్డులపైనే లావాదేవీలు జరిపి వినియోగదారుల్లో చైతన్యం కల్పించాలంటున్నారు బ్యాంకింగ్ నిపుణలు.

చిప్ కార్డులు తీసుకోని ఖాతాదారులు బ్యాంకు శాఖల్లో నేరుగా సంప్రదించి కార్డు రీప్లేస్ మెంట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కూడా కార్డు రీప్లేస్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాయి బ్యాంకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories