మామ కళ్లలో కారం కొట్టిన కోడలు..

మామ కళ్లలో కారం కొట్టిన కోడలు..
x
Highlights

తిరుపతిలో దారుణం జరిగింది. మామ కళ్లలో కారం కొట్టిందో కోడలు. మంటకు తట్టుకోలేక ఏడుస్తున్న తండ్రిపై ఆ కొడుకు కూడా కనికరం లేకుండా దాడి చేశాడు....

తిరుపతిలో దారుణం జరిగింది. మామ కళ్లలో కారం కొట్టిందో కోడలు. మంటకు తట్టుకోలేక ఏడుస్తున్న తండ్రిపై ఆ కొడుకు కూడా కనికరం లేకుండా దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. భార్యాభర్తల దాడిలో ఆ వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి నగరంలోని అనంత వీధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఆస్తికోసమే వృద్ధుడిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

వీధిలోనే అందరూ చూస్తుండగా మామపై కోడలు కారం చల్లడం, తండ్రిపై కొడుకు దాడి చేయడం ఆ వీధిలోని వాళ్లను షాక్‌కు గురి చేసింది. ఆ వీధిలోని వాళ్లంతా ఆ దృశ్యాలను వాట్సాప్‌లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కలవాళ్లంతా కలిసి బాధితుడిని రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇంతకు ముందే ఎన్నోసార్లు తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న సమాచారం అందుతోంది. ప్రస్తుతం దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో షేర్ అవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మామ కళ్లలో కారం కొట్టిన కోడలుకాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.













Show Full Article
Print Article
More On
Next Story
More Stories