Top
logo

ఐటీ గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌కుమార్‌కు మరోసారి నోటీసులు

ఐటీ గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌కుమార్‌కు మరోసారి నోటీసులు
X
Highlights

ఐటీ గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌కుమార్‌కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఎల్లుండి విచారణకు హాజరుకావాలని సిట్‌...

ఐటీ గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌కుమార్‌కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఎల్లుండి విచారణకు హాజరుకావాలని సిట్‌ ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లిలోని అశోక్‌ ఇంటికి సిట్‌ అధికారులు నోటీసులు అంటించారు. గతంలో సైబరాబాద్‌ పోలీసులు ఇచ్చిన నోటీసులకు అశోక్‌కుమార్‌ స్పందించలేదు. దీంతో 160 సీఆర్పీసీ కింద సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్‌ ఎఫ్ఐఆర్‌ నుంచి తన పేరును తొలగించాలని అశోక్‌ కుమార్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పోలీసుల నోటీసులకు వివరణ ఇవ్వాలని అశోక్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల 13న విచారణకు హాజరుకావాలని సిట్‌ అధికారులు అశోక్‌కుమార్‌కు తాజాగా నోటీసలు జారీ చేశారు.

Next Story