తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఫిర్యాదు

తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఫిర్యాదు
x
Highlights

సోదాలు,దాడులు, కోర్టు కేసులు ఆరోపణలు, ప్రత్యారోపణలు, నోటీసులు, విచారణలుగా సాగిన ఐటీ గ్రిడ్ కేసు మరో మలుపు తిరిగింది. సమగ్ర దర్యాప్తు కోసం తెలంగాణ...

సోదాలు,దాడులు, కోర్టు కేసులు ఆరోపణలు, ప్రత్యారోపణలు, నోటీసులు, విచారణలుగా సాగిన ఐటీ గ్రిడ్ కేసు మరో మలుపు తిరిగింది. సమగ్ర దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే అమరావతి కేంద్రంగానే కుట్ర జరిగింది. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఏపీ పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పార్టీ నేతలతో కలిసి గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న ఐటీ గ్రిడ్ వ్యవహారానికి సంబంధించి కుట్రంతా అమరావతి కేంద్రంగానే జరిగిందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 23న ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలకు ముందే తెలంగాణకు చెందిన కొందరు సీనియర్ పోలీస్ అధికారులు ప్రతిపక్ష వైసీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలతో సమావేశమయ్యారని తమ ఫిర్యాదులో ఆరోపించారు.

ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తమ పార్టీకి చెందిన డేటాను కుట్ర పూరితంగా తస్కరించి వైసీపీకి అందజేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు వైసీపీ, టీఆర్ఎస్‌, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు . ఈ మొత్తం వ్యవహారంలో ఏపీకి సంబంధం లేని వ్యక్తులే ఫిర్యాదుదారులుగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి 23నే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించినా మార్చి 2న కేసు నమోదైన తరువాత సోదాలు చేశామంటూ చెప్పడం కుట్రలో భాగమన్నారు. ఈ కేసు విచారణ తెలంగాణ పోలీసుల పరిధిలోకి రాకున్నా కావాలనే కుట్ర పూరితంగా దర్యాప్తు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ముందస్తుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారమే వీకెండ్‌లో ఐటీ గ్రిడ్‌పై దాడి చేసి నలుగురు ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ విమర్శలు చేశారు. ఈ వ్యవహారంలో హైకోర్టు చీవాట్లు పెట్టడంతో వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలతో ఫిర్యాదు చేయిస్తున్నారంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories