ఒడిషా తీర ప్రాంతాల పరిస్థితి అల్లకల్లోలం...20 ఏళ్లలో ఎప్పడూ విరుచుకుపడని...

ఒడిషా తీర ప్రాంతాల పరిస్థితి అల్లకల్లోలం...20 ఏళ్లలో ఎప్పడూ విరుచుకుపడని...
x
Highlights

ప్రచండ 'ఫోని' తుపాను ఒడిశాలో తీరం దాటింది. పూరీకి దక్షిణంగా తీరాన్ని తాకి ముందుకు కదులుతోంది. కోల్ కతా మీదుగా బంగ్లాదేశ్ వైపుగా పయనిస్తోంది. పోనీ...

ప్రచండ 'ఫోని' తుపాను ఒడిశాలో తీరం దాటింది. పూరీకి దక్షిణంగా తీరాన్ని తాకి ముందుకు కదులుతోంది. కోల్ కతా మీదుగా బంగ్లాదేశ్ వైపుగా పయనిస్తోంది. పోనీ ప్రభావంతో గంటకు రెండు వందల నుంచి 230 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగ్లాదేశ్ కి వెళ్లో లోపు తుపాను బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బాలాసోర్ దగ్గర తుపాను మళ్లీ సముద్రంలోకి వచ్చే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఒడిషాలోని పూరీ సమీపంలో ఫోని తుపాను తీరం దాటింది. ఒడిశా తీర ప్రాంతాల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా వీల్లేనంతగా రాకాసి గాలులు వీస్తున్నాయి. చెట్లు కూలిపోయాయి. 20 ఏళ్లలో ఎప్పుడూ ఒడిశాపై విరుచుకుపడని విధంగా భారీ తుఫాను ప్రభావం చూపిందని అధికారులు చెబుతున్నారు.

ఫోని ప్రభావంపై ఒడిశా ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రోడ్లపై విరిగిపడ్డ వృక్షాలను తొలగిస్తున్నారు. తీర ప్రాంతం ఆనుకుని ఉన్న 11 జిల్లాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాలుగు వేలకు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజనం, మంచినీరు, వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. 28 ఎన్డీఆర్ఎప్, 20 ఓడీఆర్ఎప్ బృందాలను సిద్ధం చేశారు. తుపాను ముప్పుతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తీర ప్రాంతప్రజలకు సూచనలు చేశారు.

బంగ్లాదేశ్‌ కన్నా ముందు ఫొని తుపాను కోల్‌కతాను తాకే అవకాశముండటంతో బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. తీరప్రాంత ప్రజలు మట్టి ఇళ్లను ఖాళీ చేయాలని తూపాను తీరం దాటేంత వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు పర్యాటకులు ఎవరూ తీర ప్రాంతాలకు వెళ్లొద్దని టూరిస్ట్ బోటు ప్రయాణాలను రద్దు చేసినట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories