ఏపీలో మొదలైన ఫోని తుపాను ప్రభావం...పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న సముద్రపు అలలు

ఏపీలో మొదలైన ఫోని తుపాను ప్రభావం...పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న సముద్రపు అలలు
x
Highlights

బంగాళాఖాతంలో గంటగంటకూ బలపడుతోన్న ఫోని తీవ్ర పెను తుపానుగా మారింది. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీరం వైపు పయనిస్తోంది. రానున్న 24 గంటల్లో ఇది...

బంగాళాఖాతంలో గంటగంటకూ బలపడుతోన్న ఫోని తీవ్ర పెను తుపానుగా మారింది. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీరం వైపు పయనిస్తోంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే ఏపీలో ఫోని తుపాను ప్రభావం మొదలైంది. తీవ్ర పెను తుపానుగా మారిన ఫోని ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల్లో తుపాను ప్రభావం స్పష్టం కనిపిస్తోంది. కొన్ని చోట్ల అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంతాలైన నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నంతో పాటు మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. కొన్ని చోట్ల వర్షం కురుస్తోంది.

కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్‌లో అలల ఉధృతి భారీగా పెరిగింది. సుమారు 15 అడుగుల మేర అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో బీచ్‌లో పర్యాటకులకు అనుమతి నిరాకరించారు. అటు పశ్చిమగోదావరి జిల్లాలో కొయ్యలగూడెంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.

తుపాను ప్రభావంతో నేడు, రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంట‌కు 80 నుంచి 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశ‌ం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

తీరం వైపు దూసుకొస్తున్న ఫోని రేపు మధ్యాహ్నం ఒడిశాలోని పారాదీప్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories