ఫొని తుపాను : టూరిస్టులకు ప్రభుత్వం హెచ్చరికలు

ఫొని తుపాను : టూరిస్టులకు ప్రభుత్వం హెచ్చరికలు
x
Highlights

ఫొని పెను తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు అతి సమీపంగా పయనిస్తూ ఎల్లుండి ఒడిశాలో తీరం దాటనుంది. ఫొని ప్రభావంతో...

ఫొని పెను తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు అతి సమీపంగా పయనిస్తూ ఎల్లుండి ఒడిశాలో తీరం దాటనుంది. ఫొని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు జిల్లాలతో పాటు విశాఖలోనూ అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. భారీ తుపాను నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్‌ ప్రకటించారు. గంటకు 175 - 205 కిలోమీటర్ల గాలుల వేగంతో ఒడిశాలోని గోపాలపుర్‌-చాంద్‌బలీ మధ్య ఫొని తీరం దాటే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే దాటే అవకాశం వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇక గంటకు 22 కి.మీ వేగంతో కదులుతున్న ఫొని నేటి నుంచి దిశ మార్చుకుని పయనించే అవకాముందని ఐఎండీ అంచనా వేసింది. బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది.

తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను ఒడిశా తీరాన్ని దాటే క్రమంలో శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని మండలాల్లోనూ ప్రత్యేక అధికారుల్ని నియమించారు. ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. టూరిస్టులందరూ పూరీ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది. తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ముందు జాగ్రత్తగా జనరేటర్లు, ఇంధనాన్ని సిద్ధం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories