logo

విజ్డమ్ జాబ్స్ పోర్టల్ భారీ మోసం

Ajay KollaAjay Kolla
Highlights

హైదరాబాద్‌లో ఓ బారీ మోసం వెలుగు చూసింది. నిరుద్యోగ యువతీ యువకుల నుంచి 100 కోట్లు వసూలు చేసిన ఓ కంపెనీ బోర్డు...

హైదరాబాద్‌లో ఓ బారీ మోసం వెలుగు చూసింది. నిరుద్యోగ యువతీ యువకుల నుంచి 100 కోట్లు వసూలు చేసిన ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు సంస్థ యజమానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజ్డమ్ పోర్టల్ నిరుద్యోగులను టార్గెట్ చేసుకుంది. తమకు 4000 మంది విదేశీ క్లయింట్స్ ఉన్నారనీ, విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ఈ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు నగదును కట్టారు. ఈ సంస్థకు డబ్బులు కట్టిన ఓ వ్యక్తి తనకు ఎంతకీ ఉద్యోగం రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలో దిగిన పోలీసులు సంస్థ యజమానిని అరెస్ట్ చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడని తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top