ఏపీలో మొదలైన ఎన్నిక‌ల హీట్..

ఏపీలో మొదలైన ఎన్నిక‌ల హీట్..
x
Highlights

ఏపీలో రాజకీయ కోలాహలం మొదలయ్యింది. నిన్నటి వరకు జగన్ పాదయాత్ర, టీడీపీ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన అధినేత పర్యటనలు చేపట్టింది. తాజాగా బీజేపీ బస్సు యాత్రకు సిద్ధమయ్యింది.

ఏపీలో రాజకీయ కోలాహలం మొదలయ్యింది. నిన్నటి వరకు జగన్ పాదయాత్ర, టీడీపీ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన అధినేత పర్యటనలు చేపట్టింది. తాజాగా బీజేపీ బస్సు యాత్రకు సిద్ధమయ్యింది. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు కమలనాధులు.

ఏపీలో ఎన్నికలకు కమలనాథులు వ్యూహం రచిస్తున్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడబోతుండటంతో ప్రజలకు చేరువకావాలని భావిస్తున్నారు. గతంలో ఇంటింటికి కార్యక్రమం చేపట్టిన బీజేపీ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రాష్ర్టంలో బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి బస్సు యాత్రను ప్రారంభించి నెల్లూరు జిల్లా తడ వరకు అన్ని జిల్లాలను కలుపుకుపోతూ యాత్ర కొనసాగించేలా ప్రణాలిక సిద్ధం చేశారు బీజేపీ నేతలు. గత నాలుగున్నరేళ్లు రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర పథకాలను టీడీపీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో ప్రజలకు వివరిస్తామంటున్నారు బీజేపీ నేతలు. బస్సు యాత్రతొ టీడీపీ నేతల విమర్శలకు అడ్డుకట్ట వేస్తామంటున్నారు కమలనాథులు.

మూడేళ్ల పాటు బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగిన టీడీపీ ఇప్పుడు శతృపక్షంగా మారడంతో రానున్న ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఆ దిశగానే ప్రధాని మోడీ రాష్ర్ట బీజేపీ నేతలతో ఎప్పటికప్పుడు వ్యూహా రచన చేస్తున్నారు. రాష్ర్టంలో పార్టీ పటిష్టతకు అసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అందులో భాగంగానే బస్సు యాత్రకు సిద్ధమయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. బస్సు యాత్రలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని బీజేపీ నేతలు కోరారు. బస్సు యాత్రతో ఏపీలో బీజేపీకి ఎంత వరకు మేలు జరుగుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories