logo

సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు.. కూలిన స్టేజీ

సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు.. కూలిన స్టేజీ
Highlights

తమ అభిమాన నటీ వెండితెరపై, సినీమాల్లో కనిపించడమే కానీ ప్రత్యేకంగా చూడని వారు ఉంటారు. అయితే ఆ వెండితెర నటీ...

తమ అభిమాన నటీ వెండితెరపై, సినీమాల్లో కనిపించడమే కానీ ప్రత్యేకంగా చూడని వారు ఉంటారు. అయితే ఆ వెండితెర నటీ ఒక్కసారి అభిమానుల దగ్గరికే వోస్తే అలాంటి నటి ప్రత్యక్షంగా కనబడటంతో బెంగాల్ ప్రజలు తెగ మురిసిపోయారు. అయితే తమ నటితో ఎలాగైనా ఒక సెల్ఫీదిగాలని ముచ్చటపడిన బెంగాల్‌ వాసులకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రసంగిస్తున్న వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో భయాందోళనకు గురయ్యారు. ఇక వివరాల్లోకి వెళితే ప్రముఖ బెంగాళీ నటి నుస్రత్‌ జహాన్‌ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల రణరంగంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఎన్నికల్లో భాగంగా టీఎంసీ తరఫున జార్‌గ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న బీర్బాహ సోరేన్‌కు మద్దతుగా బుధవారం నస్రత్ జహాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమెతో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పోటీపడ్డారు. ఆమె చుట్టూ అభిమానులు చేరడంతో స్టేజీ కూలిపోయింది. అయితే స్టేజీ ఎత్తు తక్కువగా ఉండటడంతో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. నస్రత్ జహాన్ కూడా తృణమూల్ కాంగ్రెస్ తరపున బసిర్హట్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top