తెలుగురాష్ట్రాల్లో బీజేపీకి పుట్టగతులుండవు

తెలుగురాష్ట్రాల్లో బీజేపీకి పుట్టగతులుండవు
x
Highlights

ప్రత్యేక హోదాకై ఏపీకి కేంద్రప్రభుత్వం దగా చేసిందని సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. గత 2014 సంవత్సరంలో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని కూడా

ప్రత్యేక హోదాకై ఏపీకి కేంద్రప్రభుత్వం దగా చేసిందని సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. గత 2014 సంవత్సరంలో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని కూడా కేంద్ర సర్కార్ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని కేంద్రప్రభుత్వాన్ని నారాయణ దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అసలు పుట్టగతులే ఉండవని నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేకహోద కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రత్యేకహోదా సాధన సమితి ధర్నా ఈరోజుతో రెండో రోజుకు చేరుకోవడంతో నారాయణ మీడియాతో మాట్లాడారు. ఇక ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఒక్కసీటు తప్ప అన్ని చోట్ల బీజేపీ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని నారాయణ అన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని నారాయణ జోస్యం చేప్పారు. ప్రత్యేహోదా సాధన సమితి చేపట్టిన ధర్నాకు సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి మరియు రాఘవులు తదితరులు మద్దతు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories