తెలంగాణ కాంగ్రెస్ లో కోవర్టుల కలకలం

తెలంగాణ కాంగ్రెస్ లో కోవర్టుల కలకలం
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కోవర్టుల భయం పట్టుకుందా...? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పార్టీలో కొందరు కోవర్టులు వ్యహరిస్తున్నారా..? కాంగ్రెస్...

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కోవర్టుల భయం పట్టుకుందా...? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పార్టీలో కొందరు కోవర్టులు వ్యహరిస్తున్నారా..? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారా..? కాంగ్రెస్ నేతల మాటలు వింటుంటే ..ఇది వాస్తవమేనని చెప్పకనే చెప్పాల్సి వస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో కోవర్టుల కలకలం రేపుతోంది పార్టీ నేతలకు కోవర్టుల భయం పట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి పార్టీ ముఖ్యనేతలే కోవర్టులుగా వ్యవహరించారని సొంత పార్టీ నేతలే కొందరు లోలోన మధనపడుతున్నారు. బహిరంగంగా అధికార పార్టీని విమర్శిస్తూ మరో దారిలో వారివారి సొంత పనులు చక్కబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అధికార పార్టీతో గొడవలు లేకుండా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నామంటూ ఇటీవల అసెంబ్లీకి ఎన్నికైన ఓ ఎమ్మెల్యే అన్నట్లుగా పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు గులాబీ పార్టీ అంటేనే అగ్గిమీద గుగ్గిలంగా వ్యహరిస్తూ వంటికాలుతో విరుచుకుపడే తాజా ఎమ్మెల్యే తన తీరు పూర్తిగా మార్చుకోవడానికి పార్టీ ముఖ్యనేతలే కారణమంటూ వ్యాఖ్యానిస్తున్నారట. అంతేకాదు పార్టీ కోసం కార్యకర్తల కోసం అధికార పార్టీతో కయ్యానికి కాలు దువ్వితే కాంగ్రెస్ ముఖ్యనేతలు లాలూచి పడి టీఆర్ఎస్ తో కోవర్టు రాజకీయాలు నడుపుతున్నప్పుడు తాము ఎందుకు కయ్యానికి పోవాలంటూ హస్తం పెద్దల ముందే వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఎన్నికలు అయిన ఒక్క రోజులోనే పార్టీలో కీలక పదవి దక్కించుకున్న నేత లగ్జరీ కారు ఎలా కొన్నాడంటూ సదరు ఎమ్మెల్యే పార్టీ నేతలతో బహాటంగానే చర్చించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి అయితే సంబంధిత నేత పేరు బయట పడకుండా కారును ఇతరుల పేరుతో ఎందుకు రిజిస్టర్ చేయించాల్సి వచ్చిందో అని కూడా చెబుతుండటం పార్టీలో జోరుగా చర్చించుకుంటున్నారు.

ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ముఖ్యనేతల తీరులో మార్పు రాకపోవడంతో తామే వారి పద్దతిలో నడుచుకుంటే సరిపోతుందన్న భావనకు కొందరు వచ్చినట్లు స్పష్టమవుతోంది. మరి కోవర్టుల భయం ఇక నైన అధిష్టానం పోగొట్టకుంటే పార్టీకి ఎప్పటికైన నష్టం తప్పదనే హెచ్చరికలు చేస్తున్నారు కొందరు నేతలు. మరి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories