డేరా బాబా రామ్ రహీమ్‌కు జీవిత ఖైదు

డేరా బాబా రామ్ రహీమ్‌కు జీవిత ఖైదు
x
Highlights

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్‌కు మరోసారి జైలు శిక్ష పడింది. పాత్రికేయుడు రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాకు పంచకుల స్పెషల్ సీబీఐ కోర్టు కోర్టు జీవిత ఖైదు విధించింది.

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్‌కు మరోసారి జైలు శిక్ష పడింది. పాత్రికేయుడు రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాకు పంచకుల స్పెషల్ సీబీఐ కోర్టు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం జీవిత ఖైదు పడిన నలుగురికి 50 వేళ జరిమానా కూడా విధించింది. డేరా బాబాకు కోర్టు శిక్ష ప్రకటించనుండటంతో ముందుస్తు జాగ్రత్తగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం ఉన్న పంచకుల, సిర్సాలో 144 సెక్షన్ విధించారు. పంచకుల న్యాయస్థానం సముదాయం చుట్టుపక్కల భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచార కేసులో 20 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రోహ్‌తక్‌లోని సునరియా జైల్లో గడుపున్నారు. ఆయన ఇప్పటికే 20 జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా ఆ శిక్ష పూర్తయిన తర్వాత జీవిత ఖైదు అమలు చేయాలని పంచకుల కోర్టు తీర్పు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories