హైదరాబాద్‌లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
x
Highlights

హైదరాబాద్ , సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు...

హైదరాబాద్ , సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. సిటీలో మొత్తం 14 కౌంటింగ్ సెంటర్స్‌లో కౌంటింగ్ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 14 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మొత్తం కౌంటింగ్ కోసం 588 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నారు.

కౌంటింగ్ జరిగే 23న ఉదయం 5గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లను అభ్యర్థుల సమక్షంలో తెరుస్తారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేస్తారు. తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈసారి ఐదు వీవీ ప్యాట్‌లలోని ఓటర్ స్లిప్పులను కౌంటింగ్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక హాల్లో లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కార్యాయాలు, సంస్థలకు లోకల్ హాలిడేగా ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories