Top
logo

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కొనసాగుతున్న చేప మందు పంపిణీ

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కొనసాగుతున్న చేప మందు పంపిణీ
X
Highlights

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమాతో బాధపడుతున్న వేలాది మంది...

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమాతో బాధపడుతున్న వేలాది మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ప్రజలు భారీగా రావడంతో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 36 కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు పరిస్ధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు చేప మందు పంపిణీ కొనసాగనుంది. రేపటి నుంచి బత్తిన సోదరుల ఇంటి దగ్గర చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది.

గత పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ... ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు వీకెండ్ కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నాంపల్లి, గాంధీ భవన్‌, అఫ్జల్ గంజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. MGBS బస్టాండ్‌తో పాటు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వచ్చే బస్సులు నేరుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. చేప ప్రసాదం స్వీకరించిన వారు నేరుగా బయటకు వచ్చి స్వస్ధలాలకు వెళ్లేలా సహాయకులను ఏర్పాటు చేశారు.

Next Story