కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ..: కేసీఆర్‌పై భట్టి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ..:  కేసీఆర్‌పై భట్టి కీలక వ్యాఖ్యలు
x
Highlights

తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను...

తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం దీనిలో భాగంగా గెలిచి వచ్చిన శాసనసభ్యుల్ని తమ పార్టీలోకి లాక్కుంటూ సీఎం రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడం బాధాకరం. నగరంలో అంబేద్కర్‌ విగ్రహం కూల్చేయడం అవమానకరమన్నారు. కొన్ని రాష్ట్రాలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

పార్టీ మారిన రేగా కాంతారావు, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనామా వెంకటేశ్వర్లు, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్టు భట్టి మీడియాకు తెలిపారు. కాగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, సురేందర్, ఉపేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ త్వరలోనే మరో లేఖరాయనున్నట్టు భట్టి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories