80 సీట్లలోనూ ఒంటరిపోరు: కాంగ్రెస్

80 సీట్లలోనూ ఒంటరిపోరు: కాంగ్రెస్
x
Highlights

దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎస్పీ, బీఎస్పీలు కలిసి కొత్త కూటమి పెట్టుకోవడంతో ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ ఒంటరైపోయింది.

దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎస్పీ, బీఎస్పీలు కలిసి కొత్త కూటమి పెట్టుకోవడంతో ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ ఒంటరైపోయింది. కాగా ఈ రెండు పార్టీలు జతకట్టడంతో కాంగ్రెస్ పార్టీ వూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ పూర్తి శక్తిసామర్ధ్యాలతో యూపీలో ఎన్నికల బరిలో పోరాడుతుంటూ కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 80 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లడుతూ వచ్చే ఎన్నికల్లో పాల్గోనేందుకు కాంగ్రెస్ పార్టీ పోటీచేసేందుకు పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశారు. ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగి గతంలో కంటే రెట్టింపు సీట్లే కాంగ్రెస్ సాధిస్తుందని గులామ్ నబీ ఆజాద్ ధీమా వ్యక్తం చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories