Top
logo

టీఆర్ఎస్‌పై మండిపడ్డ రాజనర్సింహ

టీఆర్ఎస్‌పై మండిపడ్డ రాజనర్సింహ
X
Highlights

సారు, కేసీఆరు పదహారు అంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ సీనియర్ నేత...

సారు, కేసీఆరు పదహారు అంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అసలు గడిచిన ఐదేండ్లలో తెలంగాణ సర్కార్ ఏం సాధించారని ప్రశ్నించారు. ముస్లీం, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, కాళేశ్వరానికి అసలు జాతీయ హోదా ఏమైందన్నారు దామోదర్. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ తగిన బుద్ధి చేప్పేందుకే నిజామాబాద్‌లో 175 మంది రైతులు ఎన్నికల రణరంగంలో దిగుతున్నారని అన్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ విద్యావంతులు జీవన్‌రెడ్డిని గెలిపించి ఆత్మగౌరవాన్ని చాటారన్నారు. ఎంపీ ల్యాడ్స్ కూడా ఖర్చు చేయలేని చరిత్ర బీబీ పాటిల్‌ది అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాగా జహీరాబాద్‌లో మదన్‌మోహన్‌రావును భారీ మెజరీటీతో గెలిపించాలని కోరారు.

Next Story