logo

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హైలెట్స్ ఇవే...

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హైలెట్స్ ఇవే...
Highlights

ఐదు ప్రధాన అంశాలు పలు ఆకర్షణీయమైన పథకాలు ఏపీకి ప్రత్యేక హోదా, పేదలు, రైతులు, నిరుద్యోగ యువతను ఆకట్టుకునేలా...

ఐదు ప్రధాన అంశాలు పలు ఆకర్షణీయమైన పథకాలు ఏపీకి ప్రత్యేక హోదా, పేదలు, రైతులు, నిరుద్యోగ యువతను ఆకట్టుకునేలా హామీలు అధికారం ఇస్తే హామీలు నిలబెట్టుకుంటామంటూ ప్రామిస్ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పేర్కున్న కీలక అంశాలివి. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విడుదల చేశారు. హామీలను నిలబెట్టుకుంటాం అనే అర్ధం వచ్చేలా నిభాయేంగే పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో విడుదల చేశారు. తమ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుందని రాహుల్ అన్నారు. సంక్షేమంతో సంపద సృష్టించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

దేశంలో 2030 నాటికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు.దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు.కొత్త మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ విజన్‌ను ఆవిష్కరించామని, ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశామని వివరించారు.దీన్ని గదిలో కూర్చుని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామన్నారు రాహుల్‌.

పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్స్, ఐదేళ్లలో పేదలకు 3 లక్షల 60వేలు ఉద్యోగాలు, యువతకు ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి, వ్యాపారాలు ప్రారంభించేందుకు మూడేళ్ల వరకు అనుమతులు అవసరం లేదని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌, రైతులు రుణాలు చెల్లించకపోతే క్రిమినల్‌ నేరంగా తీసుకోమని, ఉపాధి హామీని 150 రోజులకు విస్తరిస్తామని, బడ్జెట్‌లో విద్యారంగానికి 6శాతం నిధులు కేటాయిస్తామని, పేదలకు కార్పొరేట్‌ వైద్యం, అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని, వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధుల్ని పెంచుతామని రాహుల్‌ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు. మొత్తానికి నిబాయేంగే అంటూ హస్తం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజలు ఎంతవరకూ ఆకర్షితులు అవుతారో తెలియాలంటే ఎన్నికలు అయ్యే వరకూ ఆగాల్సిందే.


లైవ్ టీవి


Share it
Top