రాఫెల్ డీల్‌ విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్

రాఫెల్ డీల్‌ విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్
x
Highlights

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన డిసెంబర్ 11 నుంచి విపక్షాలు రాఫెల్ డీల్‌పై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. 2018 చివరి రోజున కూడా ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన డిసెంబర్ 11 నుంచి విపక్షాలు రాఫెల్ డీల్‌పై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. 2018 చివరి రోజున కూడా ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. రాఫెల్ అంశంపై జాయింట్ పార్లెమెంటరీ కమిటీ వేయాలని లోక్‌సభలో విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే బీజేపీని టార్గెట్ చేశారు. రాఫెల్ విమానాల ధరలు వెల్లడించడంలో కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. ఈ డీల్ విషయంలో స్కామ్ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలకు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కౌంటర్ ఇచ్చారు. పదే పదే ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం ద్వారా దాన్ని నిజం చేయలేమని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories