వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ డేగకన్ను..

వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ డేగకన్ను..
x
Highlights

ఓటమి నుంచి తేరుకోవడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. డీలాపడిన క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది హస్తం పార్టీ. ఎందుకు ఓడిపోయాం? ఎక్కడ వైఫల్యం చెందామనే అంశాలపై పీసీసీ నేతలు సమీక్ష నిర్వహించారు.

ఓటమి నుంచి తేరుకోవడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. డీలాపడిన క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది హస్తం పార్టీ. ఎందుకు ఓడిపోయాం? ఎక్కడ వైఫల్యం చెందామనే అంశాలపై పీసీసీ నేతలు సమీక్ష నిర్వహించారు. రాబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టానికి సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. చాలారోజుల తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపింది. పార్టీ ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ , జహీరాబాద్ పార్లమెంట్ కు చెందిన నేతలతో చర్చించారు. ఓటమికి గల కారణాలు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఎన్నికల్లో పీసీసీ నేతల తీరుపై పార్టీ నేతలు అభ్యంతరాలు తెలిపారు. అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించకపోవడం, పార్టీ మెటిరియల్ సైతం సమయానికి అందించకపోవడమే తమ కొంపముంచిందని గోడు వెల్లబోసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడునెలల ముందే అభ్యర్థులను ప్రకటించి పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని చెప్పినట్లు తెలిసింది. నిజామాబాద్ పార్లమెంట్ రివ్యూలో నేతల మధ్య విబేధాలే పార్టీ ఓటమి కారణమని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఓటమికి వందకారణాలు చెప్పినా ప్రజలు టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను నమ్మారని కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందామనే భావన పార్టీ క్యాడర్ భావిస్తుంది. అధిష్టానం ఈనెల 25లోగా పార్లమెంట్ అభ్యర్థులను ఫైనల్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories