10 లక్షలిచ్చారు.. బెదిరించి తప్పుకోమన్నారు..

10 లక్షలిచ్చారు.. బెదిరించి తప్పుకోమన్నారు..
x
Highlights

నిన్న నామినేషన్‌ ఉపసంహరించుకున్న నాగర్‌ కర్నూలు జిల్లా గగ్గలపల్లి కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి దొడ్ల వెంకట్‌ రెడ్డి కలెక్టర్‌ను ఆశ్రయించాడు. పోటీ...

నిన్న నామినేషన్‌ ఉపసంహరించుకున్న నాగర్‌ కర్నూలు జిల్లా గగ్గలపల్లి కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి దొడ్ల వెంకట్‌ రెడ్డి కలెక్టర్‌ను ఆశ్రయించాడు. పోటీ నుంచి తప్పుకోవాలంటూ తనను ప్రత్యర్థి బెదిరించారని ఫిర్యాదుచేశాడు. టీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్‌ రెడ్డి తనను చంపుతానని బెదిరించినందుకే పోటీ నుంచి తప్పుకున్నట్టు వెంకట్ రెడ్డి చెప్పాడు. పోటీ నుంచి తప్పుకోవాలని తనకు 10లక్షలు కూడా ఇచ్చారని తెలిపాడు. ఆ డబ్బును కలెక్టరేట్‌కు తీసుకొచ్చి డీఆర్వోకి చూపించారు. అయితే, దొడ్ల వెంకట్‌రెడ్డి నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో గగ్గలపల్లి ఎంపీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్‌ రెడ్డి నిన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌ సాక్షిగా సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఎంపీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైతే నాగర్‌కర్నూల్‌ ఎంపీపీ అవుతానని.. ఇందుకు సహకరిస్తే రూ.10లక్షలు ఇస్తానని, కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తానని ఈశ్వర్‌ రెడ్డి చెప్పారన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories