సీఎల్పీ రేసులో ఉత్తమ్‌, భట్టి, సబితా ...ఉత్తమ్‌ను బలపరస్తున్న మెజార్టీ ఎమ్మెల్యేలు ?

సీఎల్పీ రేసులో ఉత్తమ్‌, భట్టి, సబితా ...ఉత్తమ్‌ను బలపరస్తున్న మెజార్టీ ఎమ్మెల్యేలు ?
x
Highlights

కాంగ్రెస్‌లో సీఎల్పీ నేత కోసం ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్, భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డితో పాటు...

కాంగ్రెస్‌లో సీఎల్పీ నేత కోసం ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్, భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎల్పీ నేత కోసం రేసులో ఉన్నారు. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వైపే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధిష్టానం ఉత్తమ్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తే కొన్నాళ్ల పాటు పీసీసీ అధ్యక్షునిగా కూడా కొనసాగించి, తర్వాత ఈ పదవిని భట్టికి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక కుల సమీకరణల కోణంలో భట్టిని సీఎల్పీ నేతగా చేస్తే ఉత్తమ్‌ టీపీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే తనకు పీసీసీ సాధ్యం కాని పక్షంలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని శ్రీధర్ బాబు కోరుతున్నట్టు సమాచారం. ఇక మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా సీఎల్పీ పదవి కోరుకుంటున్నారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే కావడం, మాస్ లీడర్‌గా గుర్తింపు పొందడంతో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories