వీహెచ్ 2.0...పెద్దాయనకు ఎందుకింత ఫ్రస్ట్రేషన్‌

వీహెచ్ 2.0...పెద్దాయనకు ఎందుకింత ఫ్రస్ట్రేషన్‌
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాల్లో ఆయన ఎప్పటికీ సెన్షేషనే. సిచువేషన్‌ ఏదైనా సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ ఆయనే. స్టేట్‌ అయినా, సెంట్రల్‌ అయినా పొజీషన్‌...

తెలంగాణ కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాల్లో ఆయన ఎప్పటికీ సెన్షేషనే. సిచువేషన్‌ ఏదైనా సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ ఆయనే. స్టేట్‌ అయినా, సెంట్రల్‌ అయినా పొజీషన్‌ అయినా, అపోజిషన్‌ అయినా ఎవర్నీ లెక్కచేయడు. తప్పు కనిపిస్తే చాలు కడిగిపారేస్తారు. ఆయన మాటతీరే ఆయన్నో బ్రాండ్‌గా నిలబెట్టింది. అప్పటి అర్జున్‌రెడ్డి ముద్దు సీన్ల నుంచి ఇవాళ్టి కుర్చీ విషయంలో వచ్చిన కొట్లాట వరకు వీహెచ్‌లో ఫ్రస్టేషన్‌ లెవెల్స్‌ బాగానే పెరిగినట్టుంది. వీహెచ్‌ 2 పాయింట్‌ ఓ అప్‌డేటెడ్‌ వెర్షన్‌పై ఓ లుక్‌.

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజల నోట్లో మాత్రం ఎప్పుడూ నానుతూనే ఉంటారు. కోపం వస్తే అంతే అది రోడ్డైనా స్టేజీ అయినా విమర్శలు చేయడంలో నాలుక తిరిగిన నేత. తనదాకా వచ్చే వరకు ఆగేది లేదు కోపం వస్తే అంతే ఆయనలో మరో కోణం బయటపడుతుంది. అరే గిదేందిరా బై అంటూ మొదలైన గొడవ ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. నిన్నటికి నిన్న ఎర్రటి ఎండలో చలాన్లు రాస్తున్న ట్రాఫిక్‌ పోలీసులపై చిందులేశారు. జనాలను ఎందుకు పరేశాన్ చేస్తున్నారంటూ నిలదీశారు.

ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వం ప్రచారం చేస్తుందంటూ ఏకంగా సీఎం కేసీఆర్‌ పోస్టర్‌నే చించేయడం వీహెచ్‌కే చెల్లింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలగించక పోవడమేంటంటూ ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్‌ నాచారంలో నడిరోడ్డు మీదే బస్‌ను ఆపి మరీ పోస్టర్లు తొలగించారు. ప్రయాణీకులంతా సహకరించాలని కోరారు.

ఇక అర్జున్‌ రెడ్డి ముద్దు సీన్లపై వీహెచ్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా ఆ మూవీ హీరో.. ఆయన ఫ్యాన్స్‌ అంతా ఆయన్ని ట్విట్టర్‌లో ఓ ఆటాడుకున్నారు. ముద్దు సీన్లుంటేనే సినిమాలు చూస్తారా అంటూ మండిపడ్డారు. ఆ సినిమా విడుదలకు ముందు రోజుల్లో ఆయన వెళ్తున్న దారిలో ఆర్టీసీ బస్‌పై ఉన్న మూవీ పోస్టర్లను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పోస్టర్ల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన సెన్సార్‌ బోర్డ్‌ ముందు ధర్నా కూడా చేశారు. ఇక ఇదే విషయంపై రాంగోపాల్‌ వర్మ కూడా ట్వీట్‌ చేయడంతో ఆయనకు మరింత మంటెక్కింది. హీరో విజయ్‌ వెంటనే వెళ్లి వీహెచ్‌ బట్టలు చించేయాలంటూ చేసిన ట్విట్‌పై మండిపడ్డారు. ఏదేమైనా.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. తప్పు తప్పే. అదే వీహెచ్‌ స్టేట్‌మెంట్‌. అందుకే తన పర బేధం లేకుండా అందరిపైనా విమర్శలు ఎక్కు పెడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories