అసెంబ్లీ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

అసెంబ్లీ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన
x
Highlights

సీఎల్పీ విలీనంపై టీ కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి అసెంబ్లీ ముందు...

సీఎల్పీ విలీనంపై టీ కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి అసెంబ్లీ ముందు దీక్షకు దిగారు. బ్లాక్ రిబ్బన్ ధరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. తెలంగాణ ప్రజల తీర్పును కేసీఆర్‌ అవమానపరిచారని, ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్‌ తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని, అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్రగా వెళతామని ఉత్తమ్‌కుమార్‌ తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories