తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డపై రూ. లక్ష అప్పు: పొన్నం

తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డపై రూ. లక్ష అప్పు: పొన్నం
x
Highlights

గూలాబీ అధిపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పుచేస్తే...

గూలాబీ అధిపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పుచేస్తే తప్పేంటి? అన్న సీఎం కేసీఆర్ సిగ్గుపడాలన్నారు పొన్నం ప్రభాకర్. రూ. 60వేల కోట్లకు పెంచారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డపై అక్షరాల రూ. లక్ష అప్పు ఉందని, అసలు సీఎం కేసీఆర్‌కు క్రమశిక్షణ లేదని పొన్నం విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఈర్ల కొమరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పొన్నం ప్రభాకర్ పాల్గోన్నారు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories