Top
logo

కోర్టుకెళతా.. న్యాయపోరాటం చేస్తా

కోర్టుకెళతా.. న్యాయపోరాటం చేస్తా
Highlights

తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డి శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డి శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ శాసనమండలిలో అంతా ఊహించినట్లుగానే ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కీలక సంచలన నిర్ణయమే తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న అభియోగంపై ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవ రెడ్డి, రాములు నాయక్ శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేశారు. కాగా ఈ నేపథ్యంలో భూపతి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ తాను స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని తాను ఏ పార్టీ గుర్తు మీద కూడా గెలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌లో విలీనమైనట్లు గెజిటెజ్ విడుదల చేశారు మరీ అలాటంప్పుడు మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందని, అసలు ఏ ప్రాతిపదికన నాపై అనర్హత వేటు వేశారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ అంశంపై తప్పకుండా కోర్టుకు వెళతా.. న్యాయపోరాటం చేస్తా అని భూపతి రెడ్డి హెచ్చరించారు.

Next Story