సార్వత్రిక ఎన్నికల కోసం టీ కాంగ్రెస్‌ కసరత్తులు...ఎంపీగా బరిలోకి దిగాలనుకుంటున్న...

సార్వత్రిక ఎన్నికల కోసం టీ కాంగ్రెస్‌ కసరత్తులు...ఎంపీగా బరిలోకి దిగాలనుకుంటున్న...
x
Highlights

ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అసెంబ్లీ ఎన్నికల ముంగిట బోర్లా పడ్డ తెలంగాణ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించింది. మరి ఈ సారి అభ్యర్థుల...

ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అసెంబ్లీ ఎన్నికల ముంగిట బోర్లా పడ్డ తెలంగాణ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించింది. మరి ఈ సారి అభ్యర్థుల జాబితా ఎలా ఉండబోతోంది..? పాతవారికి మరోసారి అవకాశం కల్పిస్తారా..? లేక కొత్తటీమ్‌ను రంగంలోకి దింపుతుందా..? బరిలో ఉన్నదెవరు..? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ క్యాండిడేట్స్‌కు ఛాన్స్‌ ఇస్తారా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న ఆ పార్టీ నాయకులు రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు కసరత్తులు ప్రారంభించారు. మరో మూడు నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం మంతనాలు సాగిస్తున్నారు. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంటే లోకల్‌గా చక్రం తిప్పాలని భావించిన కొందరు ఎంపీ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోయే సరికి వారంతా మరోసారి ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.

అభ్యర్థుల అంతరంగం ఎలా ఉన్నా రాష్ట్ర పార్టీ హైకమాండ్‌ మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారికి లోక్‌సభ టికెట్ కేటాయించరాదనే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వారికి సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వొద్దనే వాదనలు వినిపిస్తున్నారు. అయితే కొందరు సీనియర్లు మాత్రం గతంలో పోటీ చేసినవారి స్థానాల్లో వారికే టిక్కెట్లివ్వాలని పట్టుబడుతున్నారు.

గత ఎన్నికల్లో మాజీ ఎంపీలు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, సురేష్ షేట్కార్, పొన్నం ప్రభాకర్‌లు పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఎంపీ రేస్‌లో వీరి పేర్లు వినిపిస్తున్నాయి. సర్వే సత్యనారాయణను పార్టీ నుండి సస్పెండ్ చేసినా..హై కమాండ్ నుండి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో సర్వేను అధిష్టానం పిలిచి మరీ టిక్కెట్‌ ఇస్తుందని చెబుతున్నారు.

వరంగల్ టికెట్‌ను మాజీ ఎంపీ రాజయ్యకి కట్టపెడుతుందా లేక కొత్తవారికి ఇస్తుందా అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గ్రేటర్ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. మరి సికింద్రాబాద్ టికెట్ అంజన్‌కు వస్తుందా లేదా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న అజారుద్దీన్‌కి కేటాయిస్తుందో అనే చర్చ సాగుతోంది.

నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రస్తుతం భువనగిరి నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యాష్కీతో పాటు విజయశాంతి కన్ను సైతం భువనగిరి పార్లమెంట్‌పై పడిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి గతంలో భువనగిరి నుండి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ వీరికి సహకరిస్తారా..? లేక తన అనుచర వర్గానికే టికెట్ ఇవ్వాలని పట్టుబడతారా..? అన్ని తెలియాల్సి ఉంది. మొత్తానికి పార్లమెంట్ భరిలో ఉండే అభ్యర్థులపై పార్టీ వర్గాల్లో హాట్‌ చర్చ కొనసాగుతుంది. పాతవారికా లేక కొత్తవారికా అన్నది త్వరలోనే తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories