సీఎల్పీ నేత ఎన్నికపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ

Gandhi Bhavan
x
Gandhi Bhavan
Highlights

తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత ఎవరనేది నేటితో తెర పడనుంది. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నేడు జరగనుంది. ఏఐసిసి ప్రదాన కార్యదర్శి కేఎస్ వేణుగోపాల్ సిఎల్పీ నేత ఎంపిక కోసం వస్తుండడంతో పార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత ఎంపిక కోసం పైరవీలు చేసుకుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత ఎవరనేది నేటితో తెర పడనుంది. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నేడు జరగనుంది. ఏఐసిసి ప్రదాన కార్యదర్శి కేఎస్ వేణుగోపాల్ సిఎల్పీ నేత ఎంపిక కోసం వస్తుండడంతో పార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత ఎంపిక కోసం పైరవీలు చేసుకుంటున్నారు. ఎవరికి సీఎల్పీ పదవి కట్టబెడుతారనేది పార్టీలో ఉత్కంఠంగా మారింది.

రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం కూడా చేసారు. ఈనెల 17 నుండి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని నిర్ణయించడంతో కాంగ్రెస్ లో సీఎల్పీ ఎంపిక బుధవారం జరుగనుంది. సీఎల్పీ నేత ఎంపిక కోసం ఏఐసిసి ప్రధానకార్యదర్శి కేసి వేణుగోపాల్ హైదరాబాద్ వస్తుండడంతో పార్టీలో ఎమ్మెల్యేలు ఎవ్వరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. 19 మందిలో ముగ్గురు సీనియర్ నేతలు సీఎల్పీ పదవికోసం అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 17 నుంచి అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షనేతను సమావేశాలు జరిగే లోపే ఎన్నిక చేసుకుంటారు. ఒక్క రోజు అసెంబ్లీకి ముందు కాంగ్రెస్ పార్టీ తమ పక్ష నేతను ఎన్నుకునే ఆనవాయితీ ఉంది. అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి సీఎల్పీనేతను ఎంపిక చేసే బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగించి అక్కడి నుంచి వచ్చే సీల్డ్ కవర్ లో పేరును సీఎల్పీ నేత గా ఎంపిక చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి , ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవ్వరికి వారు పైరవీలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీ ఆశీస్సులు ఎవ్వరి పై ఉంటే వారి పేరు సీఎల్పీనేత పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ లో చర్చ జరుగుతుంది. అయితే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఎవరి పేరు చూయిస్తారనే ఉత్కంఠ బుధవారంతో తెరపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories