'ఆ అభ్యర్థుల ఎన్నికను రద్దు చేయాలి'

ఆ అభ్యర్థుల ఎన్నికను రద్దు చేయాలి
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్ధులు హైకోర్టు బాట పట్టారు. తమ నియోకవర్గంలో తమ`పై గెలుపోందిన టీఆర్ఎస్ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఒకరు, పోలైనా ఓట్లకంటే లెక్కించిన ఓట్లతో తేడా ఉన్నాయని మరొకరు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్ధులు హైకోర్టు బాట పట్టారు. తమ నియోకవర్గంలో తమ`పై గెలుపోందిన టీఆర్ఎస్ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఒకరు, పోలైనా ఓట్లకంటే లెక్కించిన ఓట్లతో తేడా ఉన్నాయని మరొకరు. గెలుపోందిన అభ్యర్ధులు అక్రమంగా గెలిచారని ఇంకొకరు ఇలా ముగ్గురు కాంగ్రెస్ నేతలు కోర్టు మెట్లెక్కారు.

కోడంగల్ నియోజకవర్గంలో 10.770 ఓట్ల తో గెలుపోందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఎన్నికల చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి గెలిచారని, అతన్ని వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ లో పేర్కోన్నారు. ఇక గద్వాల్ నియోజకవర్గంలో ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకురాలు డికె అరుణ కూడా కోర్టును ఆశ్రయించారు. తమ నియోజకవర్గంలో పోలైన ఓట్లకంటే లెక్కించిన ఓట్లలో తేడాలు ఉన్నాయని పిటిషన్ లో పెర్కోన్నారు. తమపై గెలిచిన అభ్యర్ధిని అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. మరో కాంగ్రెస్ నేత దాసోసు శ్రవణ్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. తమ నియోజకవర్గంలో డబ్బు,మధ్యంతో ఓటర్లను ప్రభావితం చేయ్యడంతో పాటు ఎన్నికల నిబంధనలను పాటించకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ అక్రమంగా గెలిచారని అతన్ని వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించడం పై రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజలు తీర్పు పై ఎన్నికల సంఘాన్ని విమర్శలు చేయ్యడం తగదంటున్నారు గెలుపొందిన అభ్యర్ధులు. హైకోర్టు అసలు వీరి పిటిషన్లను స్వీకరిస్తుందా లేదా అన్నది కూడా చర్చ జరుగుంది. ఒక వేళ విచారణ కు స్వీకరిస్తే కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది. గతంలో ఏపికి చెందిన మడకశిర ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపద్యంలో తిప్పేస్వామి ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో ఆ కేసు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు వేసిన మూడు పిటిషన్ల పై కూడా హైకోర్టు అలాంటి ఆదేశాలు జారీ చేస్తుందా అనేది రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు గా ప్రమాణ స్వీకారం చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై హైకోర్టు ఎప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని సర్వత్రా రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories