ఎంపీ టిక్కెట్టుకు కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ

ఎంపీ టిక్కెట్టుకు కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలో సీనియర్లు టిక్కెట్టు కోసం పోటీపడుతున్నారు....

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలో సీనియర్లు టిక్కెట్టు కోసం పోటీపడుతున్నారు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండటంతో ఓడిపోయిన వాళ్లు ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న వారితో ప్రస్తుతం గాంధీభవన్ కిటకిటలాడుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఈ సారి పార్లమెంటుకు ఎవరూ పోటీ చేయరని నేతలు భావించారు. అయితే, పార్లమెంటు ఎన్నికల్లో ఆసక్తి ఉన్న నేతలు టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ పిలుపునివ్వడంతో నేతలంతా టిక్కెట్ల కోసం క్యూకడుతున్నారు. దీంతో మళ్లీ గాంధీభవన్‌లో ఎన్నికల సందడి మొదలైంది.

అయితే, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగడంతో ఇప్పుడు కేవలం పార్లమెంటు ఎన్నికలే జరుగుతాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన నేతలు పార్లమెంటు టిక్కెట్టుపై దృష్టిపెట్టారు. దీనికితోడు పార్టీలోని సీనియర్లు కూడా టిక్కెట్టు కోసం పోటీపడుతుండటంతో పార్టీలో భారీ డిమాండ్ ఏర్పడింది.

గాంధీభవన్‌లో ఇప్పటికే పార్లమెంటు టిక్కెట్ల దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఖమ్మం ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేశారు. ఇక చాలా రోజులుగా పోటీకి దూరంగా ఉన్న ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి భువనగిరి సీటు కోసం దరఖాస్తు చేసుకోవడంతో పార్టీలో ఆసక్తికరమైన చర్చనడుస్తోంది. ఇప్పటికే ఈ రెండు ఎంపీ స్థానాల్లో గట్టి పోటీ ఉండటం కొత్తగా పార్టీ ఉద్దండులు రంగంలోకి దిగడంపై పార్టీలో ఆసక్తి నెలకొంది.

తొలిరోజే దాదాపు 30 మంది ఎంపీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా రెండో రోజు కూడా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పార్టీలో ముఖ్య నేతలంతా దరఖాస్తుల కోసం గాంధీభవన్‌కు క్యూకట్టారు. మాజీ మంత్రి శంకర్‌రావు, చామల కిరణ్‌రెడ్డిలతో పాటు మరో 40 మంది పార్లమెంటు టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా పార్టీ టిక్కెట్ల కోసం పోటీ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. మరి పార్టీ ఏ ప్రాతిపదికన అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories