Top
logo

132 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

132 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
X
Highlights

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను ప్రకటించింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ...

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను ప్రకటించింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి బరిలో ఉన్నారు. మంగళగిరి, కుప్పం, పులివెందుల నుంచి కూడా పార్టీ అభ్యర్థులను బరిలో దింపింది. అయితే, కాంగ్రెస్ జాబితాలో రఘువీరారెడ్డి పేరొక్కటే సుపరిచితమైంది. రాష్ట్ర విభజనతో నేతలంతా ఇతర పార్టీల్లోకి జంప్ చేయడంతో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్న కాంగ్రెస్ పార్టీ 132 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అనంతపురంలోని కళ్యాణదుర్గం నుంచి బరిలో దిగబోతున్నారు. అయితే, ఈ జాబితాలో ఆయన పేరొక్కటే సుపరిచితమైంది.

నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నుంచి ఎస్.కె. సలీం పోటీ చేస్తుండగా ప్రతిపక్ష నేత జగన్‌కు పోటీగా పులివెందుల నుంచి వేలురు శ్రీనివాసరెడ్డి బరిలో నిలవనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నుంచి సురేశ్ బాబుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది.

అదే సమయంలో 22 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా కాంగ్రెస్ ప్రకటించింది. వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఏపీ విభజనతో గత ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఎన్నికల ముందే కీలక నేతలు ఆ పార్టీని వీడి టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. మిగిలిన కొద్దిపాటి నేతలు కూడా ఇటీవల పార్టీ మారడంతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. మరి ఈ అభ్యర్థుల్లో ఎంతమందికి డిపాజిట్లు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే

శ్రీకాకుళం జిల్లా..

ఇచ్ఛాపురం కొల్లి ఈశ్వరరావు

పలాస మజ్జి శారద

టెక్కలి చింతాడ దిలీప్‌కుమార్‌

పాతపట్నం బన్న రాము

శ్రీకాకుళం చౌదరి సతీశ్‌

ఆముదాలవలస బొడ్డేపల్లి సత్యవతి

ఎచ్చెర్ల కొత్తకొట్ల సింహాద్రినాయుడు

నరసన్నపేట డోలా ఉదయభాస్కర్‌

రాజాం (ఎస్సీ) కంబాల రాజవర్థన్‌

పాలకొండ (ఎస్టీ) హిమరక్‌ ప్రసాద్‌

విజయనగరం

కురుపాం (ఎస్టీ) నిమ్మక సింహాచలం

పార్వతీపురం (ఎస్సీ) హరియాల రాముడు

సాలూరు (ఎస్టీ) రాయల సుందర రావు

బొబ్బిలి వెంగళ నారాయణరావు

చీపురుపల్లి జమ్ము ఆదినారాయణ

గజపతినగరం బొబ్బిలి శ్రీను

నెల్లిమర్ల ఎస్‌.రమేశ్‌కుమార్‌

విజయనగరం సతీశ్‌కుమార్‌ సుంకరి

శృంగవరపుకోట బోగి రమణ

విశాఖపట్నం

భీమిలి లక్ష్మణ్‌కుమార్‌

విశాఖపట్నం (దక్షిణం) పి.భగత్‌

చోడవరం గూనూరు వెంకటరావు

మాడుగుల బొడ్డు బుచ్చి శ్రీనివాసరావు

అరకు (ఎస్టీ) పాచిపెంట శాంతకుమారి

పాడేరు (ఎస్టీ) వంతల సుబ్బారావు

పెందుర్తి ఆడారి రమేశ్‌ నాయుడు

పాయకరావుపేట(ఎస్సీ) తాళ్లూరి విజయ్‌కుమార్‌

నర్సీపట్నం మీసాల సుబ్బన్న

యలమంచిలి కుంద్రపు అప్పారావు

తూర్పుగోదావరి

తుని సీహెచ్‌ పాండురంగారావు

ప్రత్తిపాడు ఉమ్మాడి వెంకటరావు

పిఠాపురం పంతం ఇందిర

కాకినాడ రూరల్‌ నులుకుర్తి వెంకటేశ్వరరావు

పెద్దాపురం తుమ్మల దొరబాబు

అనపర్తి డాక్టర్‌ వడయార్‌

కాకినాడ సిటీ కోలా వెంకటవరప్రసాద్‌ వర్మ

రామచంద్రపురం ముసిని రామకృష్ణ

ముమ్మిడివరం మోపూరి శ్రీనివాస్‌ కిరణ్‌

అమలాపురం (ఎస్సీ) ఐతాబత్తుల సుభాషిణి

రాజోలు (ఎస్సీ) కాసి లక్ష్మణ స్వామి

పి.గన్నవరం(ఎస్సీ) ములపర్తి మోహనరావు

మండపేట కామన ప్రభాకర్‌రావు

రాజానగరం సోడదాసి మార్టిన్‌ లూథర్‌

రాజమండ్రి సిటీ బోడా లక్ష్మి వెంకట ప్రసన్న

రాజమండ్రి రూరల్‌ రాయుడు రాజవల్లి

జగ్గంపేట మారోతు శివ గణేశ్‌

రంపచోడవరం (ఎస్టీ) గొండి బాలయ్య

చిత్తూరు

తంబళ్లపల్లె ఎంఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి

చంద్రగిరి కేపీఎస్‌ వాసు

శ్రీకాళహస్తి సముద్రాల బత్తయ్యనాయుడు

చిత్తూరు టీకారాం

కుప్పం బీఆర్‌ సురేశ్‌బాబు

గంగాధర నెల్లూరు(ఎస్సీ) సోదెం నరసింహులు

పశ్చిమగోదావరి

కొవ్వూరు (ఎస్సీ) అరిగెల అరుణకుమారి

నిడదవోలు పెద్దిరెడ్డి సుబ్బారావు

ఆచంట నెక్కంటి వెంకట సత్యనారాయణ

పాలకొల్లు వర్థినీడి సత్యనారాయణ

నరసాపురం బొమ్మిడి రవిశ్రీనివాస్‌

ఉండి గాదిరాజు లచ్చిరాజు

తణుకు బొక్కా భాస్కరరావు

తాడేపల్లిగూడెం మార్నీడి శేఖర్‌ (బాబ్జీ)

ఉంగుటూరు పాతపాటి హరికుమార్‌రాజు

దెందులూరు దొప్పలపూడి రామకృష్ణ చౌదరి

ఏలూరు రాజనాల రామ్మోహన్‌రావు

గోపాలపురం (ఎస్సీ) ఎన్‌ఎం వరప్రసాద్‌

పోలవరం (ఎస్టీ) కేఆర్‌ చంద్రశేఖర్‌

చింతలపూడి(ఎస్సీ) మారుమూడి థామస్‌

కృష్ణా

తిరువూరు (ఎస్సీ) పరస రాజీవ్‌రతన్‌

గన్నవరం సుంకర పద్మశ్రీ

గుడివాడ ఎస్‌.దత్తాత్రేయులు

కైకలూరు నూతలపాటి పీటర్‌పాల్‌ ప్రసాద్‌

పెడన సత్తినేని వెంకటరాజు

మచిలీపట్నం ఎండీ దాదాసాహెబ్‌

అవనిగడ్డ అందె శ్రీరామమూర్తి

పామర్రు (ఎస్సీ) మువ్వ మోహనరావు

పెనమలూరు లామ్‌ తాంతియాకుమారి

మైలవరం బొర్రా కిరణ్‌

నందిగామ (ఎస్సీ) పరమేశ్వర్‌రావు వేల్పుల

జగ్గయ్యపేట కర్నాటి అప్పారావు

గుంటూరు

మంగళగిరి ఎస్‌కే సలీం

తెనాలి సీహెచ్‌ సాంబశివుడు

ప్రత్తిపాడు (ఎస్సీ) కొరివి వినయ్‌కుమార్‌

చిలకలూరిపేట మద్దుల రాధాకృష్ణ

నరసరావుపేట అలెగ్జాండర్‌ సుధాకర్‌

గురజాల యలమంద రెడ్డి

మాచర్ల యరమాల రామచంద్రారెడ్డి

ప్రకాశం

ఎర్రగొండపాలెం (ఎస్సీ) ఎం వెంకటేశ్వరరావు

దర్శి పి.కొండారెడ్డి

అద్దంకి నన్నూరి సీˆతారామాంజనేయులు

సంతనూతలపాడు (ఎస్సీ) వేమా శ్రీనివాసరావు

ఒంగోలు ఈద సుధాకర్‌రెడ్డి

కొండపి(ఎస్సీ) శ్రీపతి ప్రకాశం

మార్కాపురం షేక్‌ సాయిదా

గిద్దలూరు పగడాల రంగస్వామి

కనిగిరి పాశం వెంకటేశ్వర్లు

నెల్లూరు

కావలి చింతల వెంకటరావు

ఆత్మకూరు చెరువు శ్రీధర్‌రెడ్డి

కోవూరు జాన రామచంద్ర గౌడ్‌

నెల్లూరురూరల్‌ ఉడతా వెంకటరావుయాదవ్‌

సర్వేపల్లి పూల చంద్రశేఖర్‌

కడప

బద్వేలు (ఎస్సీ) పీఎం కమలమ్మ

రాయచోటి షేక్‌ అల్లాబక్ష్‌ బాషా

పులివెందుల వేలూరు శ్రీనివాసరెడ్డి

కమలాపురం పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి

జమ్మలమడుగు వెన్నపూస సులోచన

ప్రొద్దుటూరు గొర్రె శ్రీనివాసులు

కోడూరు(ఎస్సీ) గోశాలదేవి

కర్నూలు

ఆళ్లగడ్డ చాకలి పుల్లయ్య

శ్రీశైలం నాయక్‌ సయ్యద్‌ తస్లీమా

నందికొట్కూరు(ఎస్సీ) సి.అశోక్‌రత్నం

పాణ్యం నాగామధు యాదవ్‌

నంద్యాల చింతల మోహనరావు

బనగానపల్లె హరిప్రసాద్‌రెడ్డి

డోన్‌ వెంకట శివారెడ్డి

పత్తికొండ బోయ క్రాంతినాయుడు

కోడుమూరు(ఎస్సీ) దామోదరం రాధాకృష్ణమూర్తి

ఎమ్మిగనూరు లక్ష్మీనారాయణరెడ్డి

మంత్రాలయం శివప్రకాశ్‌రెడ్డి

ఆదోని బోయ నీలకంఠప్ప

ఆలూరు షేక్‌ షావలి

అనంతపురం

రాయదుర్గం ఎంబీ చిన్నప్పయ్య

ఉరవకొండ రామానాయుడు

తాడిపత్రి గుజ్జల నాగిరెడ్డి

శింగనమల సాకే శైలజానాథ్‌

కల్యాణదుర్గం ఎన్‌.రఘువీరారెడ్డి

రాప్తాడు జనార్దన్‌రెడ్డి

మడకశిర (ఎస్సీ) కె.అశ్వత్థనారాయణ

హిందూపురం టి.బాలాజీ మనోహర్‌

పెనుకొండ చిన్న వెంకటరాములు

పుట్టపర్తి కోట శ్వేత

ధర్మవరం రంగన్న అశ్వత్థనారాయణ

కదిరి పఠాన్‌ ఖాసింఖాన్‌

లోక్‌సభ అభ్యర్థులు

శ్రీకాకుళం డోలా జగన్మోహన్‌రావు

విజయనగరం యడ్ల ఆదిరాజు

అరకు (ఎస్టీ) శ్రుతీదేవి

అనకాపల్లి శ్రీరామమూర్తి

రాజమండ్రి నల్లూరి విజయ శ్రీనివాసరావు

కాకినాడ పళ్లం రాజు

అమలాపురం (ఎస్సీ) జంగా గౌతమ్‌

నరసాపురం కనుమూరి బాపిరాజు

ఏలూరు జెట్టి గుర్నాథం

మచిలీపట్నం గొల్లు కృష్ణ

గుంటూరు మస్తాన్‌ వలీ

నరసరావుపేట పి.సూరిబాబు

బాపట్ల (ఎస్సీ) జేడీ శీలం

ఒంగోలు డాక్టర్‌ ఎస్‌డీజేఎం ప్రసాద్‌

నెల్లూరు సీహెచ్‌ దేవకుమార్‌రెడ్డి

కడప జి.శ్రీరాములు

రాజంపేట షాజహాన్‌ బాషా

చిత్తూరు (ఎస్సీ) డాక్టర్‌ చీమల రంగప్ప

తిరుపతి (ఎస్సీ) చింతా మోహన్‌

కర్నూలు అహ్మద్‌ అలీఖాన్‌

అనంతపురం కుంచం రాజీవ్‌రెడ్డి

హిందూపురం కేటీ శ్రీధర్‌

Next Story